☼ Suryaa News
🔴 సినిమా దిగ్గజ గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ షురూ.. ముఖ్మ అతిథిగా కమల్‌ హాసన్‌
సినిమా

దిగ్గజ గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ షురూ.. ముఖ్మ అతిథిగా కమల్‌ హాసన్‌

16 Sep 2026 Sravani

భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రానికి చెన్నైలో అంకురార్పణ జరిగింది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశాన్ని ప్రారంభించారు.

భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేసి, కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గాన కోకిల భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత కథ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వేదికగా ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకకు లెజెండరీ నటుడు కమల్‌ హాసన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆయన క్లాప్‌నిచ్చి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బయోపిక్‌కు టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవితం కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆమె ప్రయాణంలో ఎన్నో అసాధారణ అంశాలు ఉన్నాయని తెలిపారు. ఏడేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పరిశోధన చేసి, కుటుంబ సభ్యుల అనుమతితో ఈ కథను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నేటి తరానికి ఆమె జీవితంలోని క్రమశిక్షణ, త్యాగాలను స్ఫూర్తిగా నిలిపేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు దక్షిణ భారత భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home