☼ Suryaa News
🔴 సినిమా మహిళా ప్రధానాంశంతో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు: సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సినిమా

మహిళా ప్రధానాంశంతో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు: సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల

03 Sep 2026 Sravani

సాధారణ కమర్షియల్ హంగులకు దూరంగా, పూర్తిగా మహిళా ప్రాధాన్యత ఉన్న భావోద్వేగాలతో వస్తున్న సరికొత్త చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు విభిన్న మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఓ భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లనుంది. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలు పోషిస్తున్నారు.

గుత్తా ప్రొడక్షన్స్ మరియు కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాాలపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ద్వారా అభిరామ్ నాయుడు దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.

విడుదల తేదీ ప్రకటనతో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. విమానాశ్రయం బ్యాక్‌డ్రాప్‌లో ప్రధాన తారాగణం అంతా సరదాగా కనిపిస్తుండగా, ట్రావెల్ బ్యాగులు, విమానం మోటిఫ్ సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తున్నాయి. “Some Trips Change Plans... Some Change Lives” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఈ ప్రయాణం పాత్రల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేవలం విదేశీ లొకేషన్లకే పరిమితం కాకుండా, మానవ సంబంధాలు, భావోద్వేగాలు, ప్రయాణంలో ఏర్పడే కొత్త బంధాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును మరింత పెంచేందుకు సిద్ధమైంది.

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

సూరజ్ బర్జాత్యా కొత్త చిత్రానికి హిమేష్ రేషమ్మియా సంగీత మ్యాజిక్.. యె ప్రేమ్ మోల్ కియాపై భారీ అంచనాలు

🕑 21 Sep 2026
సినిమా

షూటింగ్ సెట్స్‌లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్: ఆరోగ్యంపై మేకర్స్ కీలక ప్రకటన

🕑 21 Sep 2026
సినిమా

జైలర్ 2 మూవీ అప్‌డేట్: రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ నటి విధ్యా బాలన్.. పవర్‌ఫుల్ 'కాంత' పాత్ర రివీల్

🕑 21 Sep 2026
సినిమా

తత్వం సినిమా రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 2న థియేటర్లలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

🕑 21 Sep 2026
సినిమా

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన స్టార్ హీరో అజిత్ అభిమానులు

🕑 21 Sep 2026
సినిమా

మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్

🕑 21 Sep 2026
Advertisement
↗ Full Article ← Home