☼ Suryaa News
🔴 సినిమా మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ!
సినిమా

మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ!

04 Sep 2026 Sravani

మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ‘కాకా’ చిత్రానికి సంబంధించిన కీలకమైన మరియు సుదీర్ఘమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో సినిమా కథను మలుపు తిప్పే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు భారీ హై వోల్టేజ్ సీక్వెన్స్‌లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన బిహైండ్ ది సీన్ (వర్కింగ్ స్టిల్) సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ లొకేషన్ స్టిల్‌లో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీతో కలిసి సీన్ గురించి చర్చిస్తున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్‌గా, భాను-నందు డైలాగ్ రైటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home