☼ Suryaa News
🔴 సినిమా బిగ్‌బాస్ 10 రెండవ రోజు ఎపిసోడ్ హైలైట్స్: రోహిత్‌పై వర్షిణి, కృష్ణుడి తీవ్ర
సినిమా

బిగ్‌బాస్ 10 రెండవ రోజు ఎపిసోడ్ హైలైట్స్: రోహిత్‌పై వర్షిణి, కృష్ణుడి తీవ్ర

09 Sep 2026 Sravani

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 10 రెండో రోజు ఆట ఊహించని మలుపులతో, రసవత్తరమైన వాదనలతో పూర్తిగా వేడెక్కింది. 'మహాపరీక్ష'లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం హౌస్‌లో సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా కనిపిస్తాడనుకున్న నటుడు కృష్ణుడు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరోవైపు, యాంకర్ వర్షిణి రోహిత్ తీరుపై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, హౌస్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

హౌస్‌లో నాయకులుగా ఎంపికైన రామ్‌ప్రసాద్, రోహిత్‌ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సైన్యాలను ఏర్పాటు చేసేందుకు ఒక బ్యాగ్ టాస్క్‌ను నిర్వహించారు. గార్డెన్ ఏరియాలో ఉంచిన బ్యాగ్‌ల ద్వారా సభ్యులు తమ లీడర్లను ఎన్నుకున్నారు. అయితే ఈ ప్రక్రియలో వర్షిణిని చివరి వరకు ఎంచుకోకపోవడం, రోహిత్ జోక్యంతో ఆమె రామ్‌ప్రసాద్ టీమ్‌లోకి వెళ్లాల్సి రావడం ఆమెలో అసంతృప్తిని రగిలించింది. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ లీడర్లతో వాగ్వాదానికి దిగింది.

అనంతరం బ్లూ టీమ్ సభ్యులలో అనర్హుల పేర్లు చెప్పమన్న సందర్భంలో వర్షిణి అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ను లక్ష్యంగా చేసుకుంది. అగ్నిపరీక్ష సమయంలో మంచి వైబ్ ఇచ్చిన రోహిత్, హౌస్‌లోకి వచ్చాక తన యాటిట్యూడ్‌ను పూర్తిగా మార్చుకున్నాడని ఆమె విమర్శించింది. తాను ఏకంగా పెద్ద తోపులా ఫీలవుతున్నాడని, ఇతరులను సరిగా గౌరవించట్లేదని ఘాటుగా స్పందించింది. రోహిత్‌కు రియాలిటీ ఏంటో తెలియాలని, ఆయన అహం దెబ్బతినాలని ఆమె చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించాయి.

మరోవైపు నామినేషన్ బాధ్యతలను స్వీకరించిన రోహిత్ సైతం కృష్ణుడు, రామ్‌ప్రసాద్, వర్షిణి తదితరులను అనర్హులుగా ప్రకటించడంతో వివాదం తారాస్థాయికి చేరింది. రోహిత్ వ్యవహారశైలిపై మండిపడిన కృష్ణుడు, పవర్‌ని అడ్డంపెట్టుకుని సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రొటెక్టివ్‌ బాస్ టాస్క్‌లో భాగంగా జరిగిని గేమ్‌లో ఫౌల్ ప్లే ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. మొత్తానికి రెండో రోజే హౌస్‌లో మాటే తూటాగా మారి, సభ్యుల మధ్య చెలరేగిన ఈ విభేదాలు రాబోయే రోజుల్లో గేమ్‌ను మరింత రక్తి కట్టించనున్నాయి.

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

🕑 18 Sep 2026
సినిమా

2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’

🕑 18 Sep 2026
సినిమా

ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

🕑 18 Sep 2026
సినిమా

ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

🕑 18 Sep 2026
సినిమా

జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం

🕑 18 Sep 2026
సినిమా

జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home