☼ Suryaa News
🔴 సినిమా ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
సినిమా

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!

02 Sep 2026 Sravani

మలయాళంలో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెం కుడుంబ యూనిట్' తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి 'ప్రేమలు' ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశేషాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ హైదరాబాద్ తనకు సొంతూరులా మారిందని, తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. 'ప్రేమలు'తో ఏర్పడిన అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని, గిరీశ్ ఏడీ మంచి రొమాంటిక్ కామెడీని అందించారని తెలిపారు.

హీరో నివిన్ పౌలీ మాట్లాడుతూ తెలుగులో రిలీజ్ అవుతున్న తన తొలి సినిమా ఇదేనని, ప్రేక్షకుల అందరి సపోర్ట్ కోరుకుంటున్నట్లు చెప్పారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నైజాంలో విడుదల చేసిన మలయాళం వెర్షన్ రూ. 60 లక్షల గ్రాస్ సాధించిందని, ఈ స్పందన చూశాకే తెలుగులోనూ విడుదల చేయాలని డిసైడ్ అయ్యామని తెలిపారు. మలయాళంలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిందని, సెప్టెంబర్ 4న థియేటర్లలో ప్రేక్షకులు దీనిని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ 'ప్రేమలు'లాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, దర్శకుడు గిరీశ్ ఏడీ, నటులు శ్యామ్ మోహన్, సంగీత్ మరియు ఫ్యూచర్ రన్‌అప్ ఫిల్మ్స్ అరుణ్ నారాయణ్ మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

కదిరి కాళిదాస్‌గా మెగాస్టార్ చిరంజీవి.. ‘కాక’ మూవీపై క్రేజీ అప్‌డేట్

🕑 21 Sep 2026
సినిమా

బిగ్ బాస్ 10లో తీవ్ర భావోద్వేగాలు: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న హౌస్‌మేట్స్

🕑 21 Sep 2026
సినిమా

సూరజ్ బర్జాత్యా కొత్త చిత్రానికి హిమేష్ రేషమ్మియా సంగీత మ్యాజిక్.. యె ప్రేమ్ మోల్ కియాపై భారీ అంచనాలు

🕑 21 Sep 2026
సినిమా

షూటింగ్ సెట్స్‌లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్: ఆరోగ్యంపై మేకర్స్ కీలక ప్రకటన

🕑 21 Sep 2026
సినిమా

జైలర్ 2 మూవీ అప్‌డేట్: రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ నటి విధ్యా బాలన్.. పవర్‌ఫుల్ 'కాంత' పాత్ర రివీల్

🕑 21 Sep 2026
సినిమా

తత్వం సినిమా రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 2న థియేటర్లలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

🕑 21 Sep 2026
Advertisement
↗ Full Article ← Home