☼ Suryaa News
🔴 సినిమా 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం!
సినిమా

7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

02 Sep 2026 Sravani

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో ఘన విజయం సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ రంగంలో దూకుడు పెంచింది. తాజాగా నూతన నటీనటులు మరియు టెక్నీషియన్లతో సరికొత్త సినిమాను ప్రారంభించింది. 'ఇ.ఎం.ఐ' (EMI) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు.

వివిధ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న దరహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా, 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శైలజ కథానాయకిగా నటిస్తోంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నటుడు ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.

మధ్యతరగతి జీవితాల్లో ప్రతీ వస్తువు కొనుగోలుకు ఇ.ఎం.ఐ కష్టాలు ఏ విధంగా ఉంటాయనే పాయింట్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఒకేలా ఆకట్టుకునేలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా 7 పి.ఎం. ప్రొడక్షన్స్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో వైవిధ్యమైన కథాంశాలతో వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

కదిరి కాళిదాస్‌గా మెగాస్టార్ చిరంజీవి.. ‘కాక’ మూవీపై క్రేజీ అప్‌డేట్

🕑 21 Sep 2026
సినిమా

బిగ్ బాస్ 10లో తీవ్ర భావోద్వేగాలు: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న హౌస్‌మేట్స్

🕑 21 Sep 2026
సినిమా

సూరజ్ బర్జాత్యా కొత్త చిత్రానికి హిమేష్ రేషమ్మియా సంగీత మ్యాజిక్.. యె ప్రేమ్ మోల్ కియాపై భారీ అంచనాలు

🕑 21 Sep 2026
సినిమా

షూటింగ్ సెట్స్‌లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్: ఆరోగ్యంపై మేకర్స్ కీలక ప్రకటన

🕑 21 Sep 2026
సినిమా

జైలర్ 2 మూవీ అప్‌డేట్: రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ నటి విధ్యా బాలన్.. పవర్‌ఫుల్ 'కాంత' పాత్ర రివీల్

🕑 21 Sep 2026
సినిమా

తత్వం సినిమా రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 2న థియేటర్లలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

🕑 21 Sep 2026
Advertisement
↗ Full Article ← Home