☼ Suryaa News
🔴 సినిమా బిగ్ అప్‌డేట్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ #L367 అనౌన్స్‌మెంట్ టైమ్ ఫిక్స్!
సినిమా

బిగ్ అప్‌డేట్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ #L367 అనౌన్స్‌మెంట్ టైమ్ ఫిక్స్!

04 Sep 2026 Bangarraju

మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 367వ చిత్రం (#L367) అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైంది. విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలను సెప్టెంబర్ 5వ తేదీన (శనివారం) ఉదయం 11:11 గంటలకు అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ (Sree Gokulam Movies) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అటు మాలీవుడ్‌తో పాటు సౌత్ సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్‌లాల్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనున్న ఈ సినిమాకు సంబంధించి రేపు వెలువడబోయే అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home