☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి..
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి..

13 Sep 2026 Reporter

ప్రతి ఇంటా..
విఘ్నేశ్వరుని ఆశీస్సులు

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

తహసీల్దార్ శ్రీవాణి..


వల్లూరు మేజర్ న్యూస్

వినాయక చవితి పర్వదినం సందర్భంగా వల్లూరు మండల ప్రజలందరికీ తహసీల్దార్ శ్రీవాణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, శాంతిని నింపాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రజల జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు చేకూరాలని కోరారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి, పండుగను సంతోషకరమైన వాతావరణంలో, పరస్పర సోదరభావంతో, ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో వల్లూరు మండలంలోని ప్రతి ఇంటా వెలుగు, వెలసిన ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వల్లూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home