రైతు బజార్ లో సన్న బియ్యం
అనంతపురం మేజర్ న్యూస్ అనంతపురం నగరంలోని రైతు బజార్ లో సన్న బియ్యం అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 రూపాయల చొప్పున అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నగరంలోని రైతు బజార్ లో సన్న బియ్యం కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.