శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన
మంత్రాలయం సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా లో ప్రసిద్ధిగాంచిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్ రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన గురువారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ మర్యాదలతో శ్రీమట్టం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ మాంచాలమ్మను దర్శించుకున్న ఆమె తర్వాత శ్రీ స్వామివారి నిజం బృందావనాన్ని దర్శించుకున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రాలయం చేరుకున్న ఆమెకు అక్కడ మఠ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు తీర్థులు ఘనంగా సన్మానించి పల పుష్ప మంత్రాక్షితలు అందించారు ఉపాసనతో పీఠాధిపతులు మాట్లాడుతూ మంత్రాలయం కు శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు అశేషంగా వస్తుంటారని వారిని దృష్టిలో ఉంచుకొని మంత్రాలయంలో అపోలో మెడికల్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే కుటుంబ సమేతంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలని ఈసారి అందరూ కుటుంబ సమేతంగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహచార్ తదితరులు పాల్గొన్నారు