☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా
ఆంధ్రప్రదేశ్

పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా

21 Sep 2026 Madhubabu

V-డిసెంబర్ నాటికి నిర్దేశిత లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ

-అధికారులు శాఖల వారీగా పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి

నంద్యాల అర్బన్:జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగం తదితర కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మొదటి త్రైమాసిక వ్యయాన్ని 100 శాతం బుక్ చేసి, తదుపరి నిధుల వినియోగానికి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ డిసెంబర్ నాటికి గణనీయమైన పురోగతి సాధించాలని ఆదేశించారు. PM SETU కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల ద్వారా ఐటీఐల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని, జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి మంజూరైన MSME పార్కుల్లో రోడ్లు, నీరు, పైప్‌లైన్లు తదితర మౌలిక వసతుల పనులను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిసెంబర్ 31 నాటికి జిల్లాలో నిలిచిపోయిన, అసంపూర్తిగా ఉన్న సుమారు 15 వేల గృహాలను పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి, మున్సిపల్ కమిషనర్ల సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి హెల్త్ రిసార్ట్స్, రెవెన్యూ సైట్లు, రోడ్‌సైడ్ సౌకర్యాలకు సంబంధించిన భూ ప్రతిపాదనలను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో నంది ఫెస్టివల్, బెలూం ఫెస్టివల్ వంటి స్థానిక ఉత్సవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలంలో శాశ్వత హెలిప్యాడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, జిల్లా కేంద్రానికి హెలిపోర్ట్ లేని నేపథ్యంలో హెలిపోర్ట్ కోసం 10-15 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జలధార ఫేజ్-2 పనులతో పాటు మొక్కల పెంపకం, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, కంపోస్ట్ పిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు, అమృత్ మరియు వాటర్‌షెడ్ ప్రాజెక్టుల అధికారుల సమన్వయంతో నీటి వనరులను సుందరీకరించాలని సూచించారు. అటవీ శాఖ నర్సరీల అభివృద్ధి, ఆటిజం సెంటర్ల నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్లు, వన్‌స్టాప్ సెంటర్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home