☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్

12 Sep 2026 Reporter

కడప ‘మేయర్' రేసులో పనుపులేటి గౌతమ్ కుమార్

ముప్పై ఏళ్ల విధేయతకు దక్కేనా గుర్తింపు?

రాజకీయ నేపథ్యం, సేవా గుణమే బలమైన అస్త్రాలుగా మేయర్ పీఠం వైపు అడుగులు !

 

రాబోయే కడప నగర పాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే కడప మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆశావహులు తెరపైకి వస్తున్నారు. అయితే, వీరిలో అందరికంటే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కడప నగరంలో అందరికీ సుపరిచితుడైన పనుపులేటి గౌతమ్ కుమార్. గత మూడు దశాబ్దాలుగా పార్టీ జెండాను భుజాన వేసుకుని, ఒడిదుడుకుల్లోనూ తెలుగుదేశం పార్టీ వెంట నడిచిన ఆయన.. ఈసారి కడప మేయర్ టికెట్ను బలంగా ఆశిస్తున్నాడు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home