☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

13 Sep 2026 Reporter

వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

తెలుగు యువత  అధ్యక్షుడు ఏలూరి మాధవరావు

పామూరు, మేజర్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయకుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని మాధవరావు కోరారు. రసాయన రంగులు లేని పర్యావరణహిత విగ్రహాలను వినియోగించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home