☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా గణపతి నిమజ్జనం చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణపతి నిమజ్జనం చేపట్టాలి

16 Sep 2026 Reporter

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేపట్టాలి.. సీఐ కంబగిరి రాముడు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో నేడు జరిగే గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సీఐ కంబగిరి రాముడు సూచించారు.. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో 20070 వినాయకులను కొలువు తీర్చడం జరిగిందన్నారు.. పోలీసు మున్సిపల్ అధికారులు తుంగభద్ర దిగు కాలువ దగ్గర నిమజ్జనానికి  ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రధాన సోమప్ప కూడలి చేరుకునే వరకు వినాయకుల ప్రదర్శనను ఎవరికి కేటాయించిన రూట్లో వారు ఊరేగింపు కొనసాగించాలన్నారు. పోలీసు వారు హెచ్చరికలు పూజ తప్పకుండా పాటించాలని లేని పక్షాన  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం సమయంలో దిగువ కాలా దగ్గర దూకుడు ప్రదర్శనలు చేయకూడదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home