BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిని తిరస్కరించిన డానా వైట్ గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం పై ప్రజల విశ్వాసం ఎంపీటీసీ' పోస్టుమార్టం! పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం గంటలో రూ.8 కోట్లు కాజేసిన కేటుగాళ్లు టీడీపీకి హెచ్చరిక.. వైసీపీకి ఊరట..! హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సౌదీ అరేబియాలో ముగిసిన ముప్పు.. 'ఆల్ క్లియర్' ప్రకటన న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం

వైరల్ జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండండి..

Select Suryaa Now
వైరల్ జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండండి..

వైరల్ జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండండి..

- ఎర్రగుంట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ నాజినిన్ తబ్బసూమ్..

-  భీమునిగూడెం పంచాయతీలో వైద్య శిబిరం...

వైరల్ జ్వరాలు ప్రబులుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాజినిన్ తబ్బసూమ్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని భీమునిగూడెం పంచాయతీలో శుక్రవారం ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఔషధాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. మురుకు నీరు నిల్వ ఉండటం వలన దోమలు వృద్ధి చెందుతాయని, దోమల నివారణ చర్యల్లో భాగంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. మీ ఇంటి పరిశుభ్రత మీ కుటుంబానికి మూలం  అన్నారు. . ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాందాస్, ఆరోగ్య కార్యకర్త శ్రీదేవి, ఆశా కార్యకర్తల తిరుపతమ్మ, పద్మ, తదితరులు ఉన్నారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..