telanagana
విద్యార్థుల ముందే బాంబు పేల్చిన మంత్రి వివేక్!
రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదు, మా ప్రభుత్వం దిగిపోతుంది. అందుకే గ్యారెంటీ ఇవ్వలేను - విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు పాలిటెక్నిక్ విద్యార్థులతో నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోతామని, తమ ప్రభుత్వం అధికారంలో నుండి దిగిపోతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కారణం చేతనే విద్యార్థులకు తాను ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, స్వయంగా తమ ప్రభుత్వ భవిష్యత్తు మరియు రాబోయే ఎన్నికల ఫలితాలపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
