telanagana
సిఎం రేవంత్ రెడ్డిపై అధికార దుర్వినియోగం ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నమోదైన ఫిర్యాదును రాష్ట్ర లోకాయుక్త విచారణకు స్వీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని దుర్వినియోగం చేస్తూ, తన సోదరుడికి చెందిన కంపెనీకి సుమారు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎస్ నాయకులు అందించిన ఫిర్యాదును పరిశీలించిన లోకాయుక్త, దీనిని కేస్‌గా నమోదు చేసి 835/2026 అనే నంబర్‌ను కేటాయించింది. త్వరలోనే ఈ కేసు లిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని, లోకాయుక్త ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ భూ కేటాయింపులపై లోకాయుక్త సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.
