BREAKING
మెగా రైతు మేళాకు 11 బస్సులు .. ఏవో నిశాంత్ కుమార్ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా శ్రీ మహాలక్ష్మి మాత పూజలు - హోమం & దీపావళి వేడుకలు 20 మంది ఉద్యోగులకు రూ. 20 లక్షల దీపావళి బోనస్ ఇచ్చిన సూరత్ వ్యాపారి దీపావళి వేడుకల విచ్ఛిన్నంపై అమెరికా ఎంపీ ఆగ్రహం కేంబ్రిడ్జ్ కమ్యూనిటీ క్రీడా పోటీలు – 2026లో అద్విత విద్యార్థుల అద్భుత ప్రతిభ! 11 పతకాలతో క్రీడా విజయకేతనం! బస్తర్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి: నక్సలిజం రహిత తొలి పండుగ ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

డ్రైవర్ శీను కుటుంబానికి టియుసిఐ ఆర్థిక సాయం

Select Suryaa Now
డ్రైవర్ శీను కుటుంబానికి టియుసిఐ ఆర్థిక సాయం

డ్రైవర్ శీను కుటుంబానికి టియుసిఐ ఆర్థిక సాయం.

అనారోగ్యంతో మృతి చెందిన బొగ్గు టిప్పర్ డ్రైవర్ లాకావత్ శీను కుటుంబానికి మోటార్ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేసినట్లు శుక్రవారం తెలిపారు.  కాలనీ తండాకు చెందిన శీను మృతికి సంతాపంగా, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ,నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబానికి రూ.26 వేల నగదుతో పాటు, క్వింటాల్‌న్నర బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టియుసిఐ అనుబంధ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. పాయం .వెంకన్న మాట్లాడుతూ,ఈ నెల 1వ తేదీన అనారోగ్యంతో శీను మృతి చెందాడని తెలిపారు. తోటి డ్రైవర్లు, ఇతరుల సహకారంతో, యూనియన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి, ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. కోయగూడెం ఓసీ ప్రారంభమైనప్పటి, నుండి శీను సుదీర్ఘకాలం బొగ్గు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేశారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో టియుసిఐ మోటార్ వర్కర్స్ యూనియన్ టేకులపల్లి బ్రాంచి కార్యదర్శి గుగులోతు మదర్, చింటూ, రమేష్, రాము, చోటు, పవన్, మోకాళ్ల చంద్రశేఖర్, బుచ్చయ్య, నాగరాజు, అశోక్, వంశీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి దస్రు టేకులపల్లి