'హద్దులు దాటితే చర్యలు తప్పవు'

Select Suryaa Now

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్న నేతల వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పరిమితులు దాటి నేరుగా పార్టీ తీవ్రంగా పరిగణించే వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేదని, వారి వ్యాఖ్యలు పార్టీ చట్రంలోనే ఉన్నాయని తెలిపారు. అయితే సుష్మిత మాత్రం స్పష్టంగా పార్టీ లైన్ దాటారని పేర్కొన్నారు. హోదా, పదవులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ విధానాలకు మరియు పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీలో ప్రశాంతత, సమన్వయం పాటించాల్సిన అవసరం ఉందని, ఎవరూ సొంతంగా నిర్ణయాలు ప్రకటించుకోవడం లేదా క్రమశిక్షణను ఉల్లంఘించడం చెల్లదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.