మంత్రుల పెంపుడు జంతువులకు ఉన్న వసతులు విద్యార్థులకు లేవు: సీజేపీ నేత తీవ్ర ఆగ్రహం

Select Suryaa Now

మంత్రుల నివాసాల్లో ఉండే పెంపుడు జంతువులకు లభిస్తున్న సౌకర్యాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందడం లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని సర్కారీ బడుల దయనీయ పరిస్థితులపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి దాదా భూసే వెంటనే తన రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు.

సీజేపీ నిర్వహించిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా దీప్కే లాతూర్ జిల్లా ఉజని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ పాఠశాలల్లో డెస్కులు, తరగతి గదులు, కనీస శౌచాలయాల సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. పలు చోట్ల విద్యార్థుల పరిస్థితులు జంతువుల కంటే దారుణంగా తయారయ్యాయని వాపోయారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినప్పుడే సామాన్యుల పిల్లల అవస్థలు వారికి అర్థమవుతాయని, అప్పుడే సర్కారీ బడుల రూపురేఖలు మారతాయని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.