గుజరాత్‌లో కాల్వలోకి దూసుకెళ్లిన బైక్

Select Suryaa Now

ఇద్దరు యువకులు గల్లంతు
గుజరాత్:గుజరాత్‌లోని సూరత్ జిల్లా చల్తాన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అగ్నిమాపక అధికారి కథనం ప్రకారం
"శనివారం రాత్రి పసిఫిక్ కాలేజీకి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న కాలువ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ప్రమాదానికి గురైన మోటార్ సైకిల్‌ను కాల్వలో నుంచి బయటకు తీశాం. నీటిలో కొట్టుకుపోయిన ఆ ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి" అని అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.ఆర్. సోనీ వెల్లడించారు.