కేవలం 21 ఏళ్ల వయసులో అద్భుతం.. యువ నిర్మాతను ప్రశంసలతో ముంచెత్తిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్!
సూర్య ఆధ్యాత్మిక డెస్క్: సినిమా రంగంలో సరైన కథ, బలమైన నమ్మకం ఉంటే బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏ స్థాయి సంచలనాలు సృష్టించవచ్చో ‘హనుమాన్ అంశ్’ సినిమా మరోసారి నిరూపించింది. కేవలం రెండు కోట్ల రూపాయల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ అద్భుత విజయం సాధించిన ఈ చిత్రానికి కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు గల యువ నిర్మాత అనుప్రియ నగర్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
ఈ నేపథ్యంలో పిన్న వయసులోనే ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యువ నిర్మాత అనుప్రియ నగర్‌ను ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి, కొన్ని మాత్రమే చరిత్ర సృష్టిస్తుంటాయి కానీ నీ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే అయిఉండి నువ్వు సాధించిన ఈ విజయం నిజంగా అద్భుతం అంటూ సంజయ్ దత్ ఆమెను ప్రశంసించారు. చిన్న సినిమాను పెద్ద సంచలనంగా మార్చడంలో నీ అంకితభావం స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు.
ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది రచన మరియు దర్శకత్వం వహించగా, ఆయన రాసిన డివైన్ డిటూర్ దట్ చేంజ్డ్ మై లైఫ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర మరియు ఆయన బోధనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. తన అద్భుతమైన మరియు సంయలనంతో కూడిన నటన ద్వారా ఆయన ఆధ్యాత్మిక గురువు పాత్రను రక్తికట్టించారని, ఎలాంటి అతిశయోక్తులు లేకుండా పాత్రను చాలా సహజంగా తెరకెక్కించారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
అనుప్రియ నగర్ భవిష్యత్తులో చేయబోయే అన్ని ప్రాజెక్ట్‌లకు తన పూర్తి మద్దతు ఉంటుందని సంజయ్ దత్ తన సందేశంలో భరోసా ఇచ్చారు. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఈ చిత్రం కేవలం బాక్సాఫీస్ వద్దే కాకుండా ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకుంది. ఇలాంటి చిన్న చిత్రాల విజయాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ ప్రతిభావంతులకు మరియు కొత్త నిర్మాతలకు ఎంతో పెద్ద స్ఫూర్తిని ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: రజినీకాంత్ 'జైలర్ 2' మూవీ టికెట్ల ధరలు భారీ వాత.. స్పెషల్ షోల కోసం రూ. 2000 వరకు డిమాండ్!