రమేష్ తౌరానీ దీపావళి వేడుకల్లో మెరిసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రముఖ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకకు నల్లటి షర్ట్, జీన్స్ ధరించి వచ్చిన సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన జా లైన్ , సరికొత్త ఫిజిక్ చూసి అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు.
ఈ ఈవెంట్ వద్దకు చేరుకోగానే పాపరాజీలు కెమెరాలతో సల్మాన్‌ను ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఆ సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ స్పందిస్తూ “భాయ్, ఈ వేడుకలో అందరికంటే మీరే చాలా బాగున్నారు” అని ప్రశంసించారు. దానికి సల్మాన్ ఖాన్ ఎంతో వినయంగా “థాంక్యూ!” అని సమాధానమిస్తూ చిరునవ్వు చిందించారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ తన వింటేజ్ లుక్‌తో తిరిగి వచ్చారని, ఈ వయసులో కూడా ఇంత ఫిట్‌గా ఉండటం నిజంగా అద్భుతమని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. బ్లాక్ డ్రెస్సులో ఆయన లుక్ ఎంతో రాయల్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ఈ విధంగా తన స్టైలిష్ అండ్ ఫిట్ లుక్‌తో దీపావళి వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త సినిమాల పై కూడా బాలీవుడ్ వ్యాపార వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.