BREAKING
టీడీపీకి హెచ్చరిక.. వైసీపీకి ఊరట..! హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సౌదీ అరేబియాలో ముగిసిన ముప్పు.. 'ఆల్ క్లియర్' ప్రకటన న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం కొలంబియా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి: ముగ్గురు సైనికులు మృతి జపాన్‌లో బలమైన భూకంపం: 5.7 తీవ్రత నమోదు మూడు చింతలపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం దూలపల్లి 289 డివిజన్‌లో ఘనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు! ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిలిచిపోయిన 'డెడ్‌లాక్ సర్వైవర్' గేమ్ సర్వర్లు

ఉపాధ్యాయుల ట్రెజరీ సమస్యలు పరిష్కరించాలి... జిల్లా ట్రెజరీ అధికారిని కోరిన యుటిఎఫ్ నాయకులు

Select Suryaa Now
ఉపాధ్యాయుల ట్రెజరీ సమస్యలు పరిష్కరించాలి...  జిల్లా ట్రెజరీ అధికారిని కోరిన యుటిఎఫ్ నాయకులు

శ్రీకాకుళం, సూర్య : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ట్రెజరీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ జిల్లా ట్రెజరీ అధికారి సీహెచ్ రవికుమార్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు ఎండ ఉమాశంకర్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, రాష్ట్ర కౌన్సిలర్ పొందూరు అప్పారావు జిల్లా ట్రెజరీ అధికారిని కలిసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన జిల్లా ట్రెజరీ అధికారి సీహెచ్ రవికుమార్ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు యుటిఎఫ్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా ట్రెజరీ అధికారికి ఉమాశంకర్, పొందూరు అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.