andhrapradesh
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం..
సేవా స్ఫూర్తి చాటుకున్న అభిమానులు..
చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహణ..
ముఖ్య అతిథిగా హాజరైన జనసేన జిల్లా అధ్యక్షులు అహుడ చైర్మన్ టీసీ వరుణ్
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి
డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా అనంతపురం నగరంలో రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామినాయుడు సూచనల మేరకు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి జనసేన జిల్లా అధ్యక్షులు అహుడ చైర్మన్ టి.సి. వరుణ్, జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు ప్రారంభించారు.
మెగా యూత్ ఫోర్స్ సహకారంతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు, యువత పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అభిమానులను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా సమాజ సేవ వైపు నడిపించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుందన్నారు. రక్తదానం అనగానే చిరంజీవి అభిమానులు గుర్తుకొస్తారని పేర్కొన్నారు. చిరంజీవి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంగడి చలపతి, చంద్రమౌళి, కాయగూర లక్ష్మీ ప్రసాద్, షామీర్, గల్లా హర్ష, రామ్ చరణ్, మెగా యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్, తేజ రాయల్, వరుణ్ గౌడ్, సాయి కృష్ణ, శేషాద్రి, సురేంద్ర, చంద్ర, శబరి, శ్యామల దేవి, వెంకటనారాయణ, శివారెడ్డి, సంపత్, చిన్నా, విజయ్ కృష్ణ, అంజి, మాధవ్, ముఖేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు.
