కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్న బండ్రెడ్డి వంశీయులు
చుండూరు(భట్టిప్రోలు) మేజర్ న్యూస్: చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా బండ్రెడ్డి వంశీయులు అమ్మవారికి మొక్కుబడులను చెల్లించుకున్నారు. నైవేద్యాలతో, పొంగళ్లతో,మేళ తాళాలతో భాజా భజంత్రీలతో ఇంటి వద్ద నుండి బంధువులు మిత్రులు సపరివార సమేతంగా ఊరేగింపుగా అమ్మవారి దేవాలయం వద్దకు వెళ్లి అమ్మవారికి మొక్కుబడులను తీర్చుకున్నారు. ముందుగా అమ్మవారికి అభిషేకాలు చేసి కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు జేశారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి కృష్ణకుమారి కుమారులు బండ్రెడ్డి శేషగిరిరావు-ధనలక్ష్మి దంపతులు, జయచంద్, జస్వంత్ లు, బండ్రెడ్డి విజయకుమార్-నాగలక్ష్మి దంపతులు, ధనిష్, సహస్ర, మరియు తాటివాక సాంబశివరావు (శివయ్య) కుటుంబీకులు పూజలో పాల్గొన్నారు. భక్తులచే దేవస్థానం అర్చకులు మామిడిపల్లి నాగేశ్వరరావు శర్మ పూజలు జరిపించారు. సాయంత్రం సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్రతువు నిర్వహించిన బంధువులు, స్నేహితులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.