BREAKING
టీసీఎస్ క్యూ2 పనితీరు: గత ఐదేళ్లలో ఐటీ దిగ్గజం ప్రయాణం.. కీలక మైలురాళ్లు మరియు ఆర్థిక గణాంకాలు! గూగుల్ ఫిన్‌లాండ్ ఏఐ ప్రాజెక్టులకు పర్యావరణ బ్రేక్: రెండు భారీ డేటా సెంటర్ల నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేత! ఓలా ఎలక్ట్రిక్ రూ. 1,000 కోట్ల రైట్స్ ఇష్యూకి ఆమోదం: 26 శాతం డిస్కౌంట్‌తో షేర్ల కేటాయింపు! టాటా ఏరిస్ సీఎన్‌జీ 39 కి.మీ మైలేజ్ నిజమేనా: అధికారిక గణాంకాలు మరియు అసలు వాస్తవాలు ఇవే! గాల్లో ఉండగా ఇండిగో విమానాన్ని తాకిన పిడుగు: దెబ్బతిన్న నోస్ భాగం.. లక్నోలో సురక్షిత ల్యాండింగ్! రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల ఆచూకీలభ్యం విద్యార్థులకు 600 సైకిళ్ల పంపిణీ. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల విరుచుపాటు: 24 మంది మృతి.. అత్యంత హేయమైన దాడిగా జెలెన్‌స్కీ ఖండన! సింగపూర్‌లో పంజాబ్, హర్యానా ప్రవాస పారిశ్రామికవేత్తలతో సీఎం నయాబ్ సింగ్ సైనీ భేటీ: రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం! అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్: వర్క్ పర్మిట్ కోసం 70 వేల డాలర్ల ఫీజు.. ట్రంప్ సర్కారు సంచలన ప్రతిపాదన! విలేఖరి డి బాబురావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు భారత్-కెనడా మధ్య రక్షణ సంబంధాల బలోపేతం: ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలపై దృష్టి! గుత్తి చెరువు కట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత నానా పటేకర్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం పాక్ ఆర్మీ చీఫ్‌తో ఇమ్రాన్ ఖాన్ అంశాన్ని లేవనెత్తిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్?

భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Select Suryaa Now
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ 
ఇరువురికి రక్త గాయాలు
రూరల్ మండల పరిధిలోని సంతేబిదనూరు గ్రామంలో ఓ భూమి వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఇరువురికి రక్త గాయాలు అయిన సంఘటన చోటు చేసుకుంది.ఈ సందర్భంగా సంతేబిదనూరు రెవిన్యూ పొలంలో గ్రామానికి చెందిన జయ రంగప్ప. పెద్ద రాజప్ప కుటుంబాలకు  సంబంధించిన సాగు భూములు కలవు. ఇరువురు రైతుల భూముల్లోకి వెళ్లడానికి రహదారి వివాదం నెలకొంది. రహదారి వివాదం పరిష్కారం కోసం సర్వే చేయాలని జయ రంగప్ప కుటుంబ సభ్యులు భూమి సర్వే చేయడానికి చలానా కట్టారు. అయితే శుక్రవారం పెద్దరాజప్ప  కుటుంబ సభ్యులు తమ పొలములోకి వెళ్లడానికి రహదారి ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న జయరంగప్ప కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని సర్వే చేసే వరకు రహదారి ఏర్పాటు చేయకూడదని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణకు తలబడ్డారు.ఇరు వర్గాల ఘర్షణలో రామంజి. హనుమంతప్పలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఇరవర్గాల ఘర్షణకు ఎలాంటి సంబంధం లేని అబూబకార్ అనే వ్యక్తిని కూడా ఓ వర్గం వారు చితకబాదారు. 
వెంటనే సమీపవాసుల జోక్యం చేసుకొని బాధితులను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ వర్గానికి చెందిన రామంజి అనే బాధితుడు  మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం తమ సమీప బంధువైన జయ రంగప్ప సాగుభూమికొన్నారని ఆ భూమిలో పంటల సాగు చేసుకుని కుటుంబ జీవనాలు సాగిస్తున్నామన్నారు. తమ గ్రామానికి చెందిన పెద్దరాజప్ప. ఆవులప్ప కుటుంబ సభ్యులకు కూడా తమ భూమి సమీపంలోనే సాగు భూమి కలదని ఆ భూమిలోకి వెళ్లడానికి తమ భూమి సమీపంలో రహదారి ఏర్పాటు చేయడానికి పూనుకున్నారన్నారు. మీ భూమిలోకి వెళ్లడానికి దారి లేదని వేరే దారి చూసుకోవాలని వారికి నచ్చ చెప్పామని వారు వినకపోవడంతో భూమి యొక్క రహదారి కోసం సర్వే చేయాలని చాలానా కట్టడం జరిగిందన్నారు. అయితే సర్వే చేసి కొలతలు వేయకుండానే వారు ఇష్ట రాజ్యాంగ రహదారి ఏర్పాటు చేయడానికి పూనుకున్నారని దీన్ని తాము అడ్డుకుంటే తమపై దాడి చేశారని ఆరోపించారు.ఆవులప్ప. 
పెద్ద రాజప్ప కుటుంబానికి సంబంధించిన హనుమంతప్ప మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాము భూమి కొనుగోలు చేసి పంటలు సాగు చేసి కుటుంబ జీవనాలు సాగిస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జయ రంగప్ప భూమి సమీపంలోనే తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుండవారమని అయితే ఇటీవల కాలంలో తమ పొలానికి వెళ్లడానికి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.తమకు ఉన్న సమాచారం మేరకు తమ పొలంలోకి వెళ్లడానికి దారి ఏర్పాటు చేసుకుంటే ఇది  జీర్ణించుకోలేని రామంజి వారి కుటుంబ సభ్యులు తమపై దాడులు చేసి గాయపరిచారని విమర్శించారు. అబూబకర్ అనే బాధితుడుమాట్లాడుతూతమనీటి కొళాయి కి సంబంధించిన సామాన్లు తెచ్చడానికి గ్రామం వైపు వెళుతుండగా ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నారు.ఇరు వర్గాల ఘర్షణ తనకు ఎలాంటి సంబంధం లేదు.అయితే అనవసరంగా రామంజి కుటుంబ సభ్యులు తనను విపరీతంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.