బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. జగన్ అడ్డంకులు సృష్టించారు నియోజకవర్గ బీసీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట మేజర్ న్యూస్:
బీసీల రాజకీయ,సామాజిక,ఆర్థిక అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం మద్దిబోయిన శివ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బీసీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.2019-24 మధ్య బీసీలకు దక్కాల్సిన 16,800కు పైగా స్థానిక సంస్థల పదవులను వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందని ప్రత్తిపాటి ఆరోపించారు.జగన్ అడ్డంకులు సృష్టించకుంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వపరంగా అమలయ్యేవని పేర్కొన్నారు.బీసీలకు మరింత ప్రాధాన్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించే ఆలోచనలో ఉన్నారని ప్రత్తిపాటి తెలిపారు.బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కూటమి విజయానికి సమష్టి కృషి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు,కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.40 రోజుల ఎన్నికల కార్యాచరణతో నిబద్ధతగా పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో నియోజకవర్గ అబ్జర్వర్ ఆడక స్వాములు,సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు,మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా,పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్,మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు,జవ్వాజి మధన్ మోహన్,బండారుపల్లి సత్యనారాయణ,మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తేళ్ల సుబ్బారావు,మద్దుమాల రవి,కందుల రమణ,మద్దిబోయిన శివ,ముల్లా కరిముల్లా,కొత్త కోటేశ్వరరావు,షేక్ మస్తాన్ వలి,పిల్లి కోటేశ్వరరావు,కంచర్ల శ్రీనివాసరావు,తుపాకుల అప్పారావు,అవ్వారు లక్ష్మణ్,అద్దంకి అనితా భాయి,నిమ్మకాయల ప్రసాద్ తదితర బీసీ నాయకులు,టీడీపీ నేతలు పాల్గొన్నారు.
రిపోర్టర్: చిలకలూరిపేట ఆర్సీ ఇంచార్జీ కొణిదెన నరేంద్ర