3వ రోజుకు చేరిన షిరిడి సాయిబాబా ఆరాధనోత్సవాలు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లో వేంచేసి యున్న శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో 108 వ ఆరాధనో త్సవాల సందర్భంగా మూడవ రోజైన మంగళవారం శ్రీ బాబా వారికి బస్మాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ రోజున అభిషేకాన్ని నిర్వహించిన దంపతులు చన్నగిరి శ్రీరామ కృష్ణారావు- సునంద, మాటూరు రామకృష్ణ ఉమాశంకర్- గృహలక్ష్మి, మాటూరు లక్ష్మణరావు- సీతారామలక్ష్మి, కోట తాండవ కృష్ణ-నలిని కుమారి, కోన శ్యాం ప్రసాద్-స్వప్న, కోన గోపికృష్ణ-లక్ష్మీ తిరుపతమ్మ కార్యక్రమాల్ని దేవస్థాన అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు, ఉపాధ్యక్షులు బట్టు రమేష్ బాబు, చెన్నగిరి రాంబాబు, కార్యనిర్వహ కార్యదర్శి జవ్వాది వెంకటేశ్వరరావు, కోశాధికారి బూర్లె కిరణ్ కుమార్, ఉత్సవ కమిటీ నిర్వహణ సభ్యులు తటవర్తి అర్ధనారీశ్వరుడు, చందలూరు రామకోటేశ్వరరావు, చందలూరి శివప్రసాద్ దేవస్థాన కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. పూజాది కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకులు మురికిపూడి దుర్గా ప్రసాద్ శర్మ నిర్వహించారు.