గుంతకల్లు రైల్వే, మేజర్ న్యూస్
అవిభక్త దక్షిణ మధ్య రైల్వే జోన్, ఇంజనీరింగ్ విభాగంలో 23 మంది సిబ్బంది ఎఇఎన్/ ఏఎక్జెఇఎన్ లుగా ఎంపికయ్యారు. ఈమేరకు సంబంధిత ఉన్నతాధికారులు ప్యానెల్ విడుదల చేశారు.
మే నెలలో, ఈనెల10 నుండి 12 వరకు మూడు రోజులపాటు నిర్వహించిన నిర్వహించిన డిపార్ట్మెంటల్ ఎల్ డి సి ఇ 30 శాతం సహాయ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించిన వ్రాత, మౌఖిక పరీక్ష ఫలితాల ప్యానెల్ ను గురువారం విడుదల చేశారు.
ఉమ్మడి దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంతో పాటు, జోన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న సహాయ అధికారుల ఎఇఎన్/ ఏఎక్జెన్ పోస్టులను డిపార్ట్మెంటల్ 30 శాతం ఎల్ డి సి ఇ కోటాలో పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేశారు.
రైల్వే జోన్ పునర్వ్యవస్థీకరణకు ముందు రైల్వే శాఖ ఈఏడాది మే 24,31 తేదీల్లో ఈపరీక్షలను ఆన్ లైన్ సిబిటి ద్వారా వ్రాత పరీక్షలు నిర్వహించగా, ఈనెల 10,11,12 తేదీల్లో మౌఖిక పరీక్షలు నిర్వహించి గురువారం తుది ఫలితాలకు సంబంధించిన ప్యానెల్ ను విడుదల చేశారు.
ఎల్ డి సి ఇ 30 శాతం పరీక్షా ఫలితాలలో
అవిభక్త దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా ఏఇఎన్/ఏఎక్జెన్ పోస్టుకు 76 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా, తాజాగా గురువారం విడుదల చేసిన తుది ఫలితాలలో 23 మందిని ఎంపిక చేస్తూ ప్యానెల్ రిలీజ్ చేశారు.
వీరిలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుంతకల్లు డివిజన్ నుండి ఐదుగురు, గుంటూరు డివిజన్ నుండి నలుగురు, విజయవాడ డివిజన్ నుండి ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది ఎంపిక అయ్యారు.