ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎలాన్ మస్క్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు రికార్డు స్థాయిలో సుమారు 1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో గురువారం జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ ఓటింగ్‌లో 75 శాతానికి పైగా ఇన్వెస్టర్లు మస్క్ ప్యాకేజీకి మద్దతుగా నిలిచారు. ఈ ప్రణాళిక ప్రకారం ఎలాన్ మస్క్ కొన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను చేరుకుంటే, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా మార్కెట్ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయి. ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు దాదాపు 1 శాతం పెరిగాయని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa