పాశమైలారం పేలుడు ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు ఏపీ కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, ఈ ప్రమాద ఘటనలో 12 మంది చనిపోగా.. మరో 30 మందికిపైగా గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa