ప్రస్తుత రోజుల్లో ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేరుగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయలేని వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో లంప్‌సమ్ పెట్టుబడి పెట్టలేని వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా నెల నెలా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసే వారు సిస్టమాటిక్ విత్ డ్రావల్ ప్లాన్ ద్వారా పెన్షన్ మాదిరిగా వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా తమ అవసరాలకు తగినట్లుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు సైతం కస్టమర్ల అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఫండ్స్ అందుబాటులోకి తెస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ, ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రిస్ ఐబీఎక్స్ ఫైనాన్షఇయల్ సర్వీసెస్ 3-6 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్ పేరుతో ఈ కొత్త ఫండ్ తీసుకొచ్చింది. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 28వ తేదీన మొదలవుతుంది. మే 5, 2025వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించారు. అంటే మీ వద్ద వంద ఉంటే ఇందులో చేరవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీతో పాటు మరో 3 కొత్త స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో డీఎస్‌పీ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 28వ తేదీన మొదలై మే 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించింది. దీంతో పాటు వస్తున్న మరో స్కీమ్ యూటీఐ మల్టీక్యాప్ ఫండ్ ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ 29న వస్తోంది. మే 13వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో కనీస పెట్టుబడిని రూ.1000గా నిర్ణయించారు.
ఇక మూడో స్కీమ్ మిరే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తోంది. మిరే అసెట్ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిల్ ఈటీఎఫ్ . ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ 30న ఓపెన్ అవుతోంది. మే 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు.
![]() |
![]() |