హైదరాబాద్ శివారు చెంగిచెర్లలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి భారీగా బంగారం, వెండి నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. సంక్రాంతి సెలవులకు యజమానులు ఊరెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రజలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa