ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ టోర్నమెంట్లోప్రథమ బహుమతి గెలుచుకున్న జాల్ తండా యువకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 05:28 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున సాగర్ సమీపంలోని జాల్ తండా గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో దాదాపు 50 గ్రామాల యువకులు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన మ్యాచ్ లలో జాల్ తండా యువకులు ప్రథమ బహుమతిగా 30,116 రూపాయలు శనివారం గెలుచుకున్నారు. దీనిని గ్రామ సర్పంచ్ బామిని సర్మన్ నాయక్ అందజేశారు. ద్వితీయ బహుమతిని 20,116 రూపాయలతో సపావట్ తండా యువకులు, తృతీయ బహుమతిని 15,116 రూపాయలతో నాయకుని తండా యువకులు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ ను దత్తాత్రేయ యూత్ యువకులు నిర్వహించారు. గ్రామస్తులు వారిని అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa