తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో నేటి(మంగళవారం) నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC వెల్లడించింది. 3 విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. మొదటి విడతకు నవంబర్ 27 నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. దీనికి డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. రెండవ విడతకు నవంబర్ 30 నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎన్నికకు డిసెంబర్ 14న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడతకు డిసెంబరు 3 నుండి నామినేషన్లు తీసుకుని, 17 పోలింగ్ నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa