ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, మైనారిటీ, నాన్‌మైనారిటీ మెడికల్ కాలేజీల పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటాకు 85% స్థానిక, 15% ఆల్ ఇండియా రిజర్వేషన్‌లు వర్తించవని తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అకడమిక్ ఇయర్‌కు తాజా సవరణలు వర్తించవని, అక్టోబర్ నోటిఫికేషన్ ప్రకారమే అడ్మిషన్‌లు ఇవ్వాలని ఆదేశించింది. బెంగళూరు, రాజస్థాన్, తిరుపతి అభ్యర్థులు జీఓ 200, 201లను సవాల్ చేయగా, హైకోర్టు ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa