TG: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి పది జిల్లాల నాయకులతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధం కావాలన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతూ అందర్నీ కలుపుకొని పార్టీని విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa