బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 11వ తేదీన సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ తెలిపారు. శనివారం సంఘ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, మల్లికార్జున్ పటేల్, కృష్ణ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa