ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 05:02 PM

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa