అందోల్ చౌటకూర్ గ్రామం నుండి కొన్యాలకు వెళ్ళే రోడ్డు భారీ వర్షాలకు పాడైపోవడంతో, పంట పొలాలకు వెళ్ళడానికి, ఇతర గ్రామాలకు ప్రయాణించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో పనులు మొదలయ్యాయి. దీనిపై గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa