హైదరాబాద్‌లోని KPHB కాలనీలో మున్సిపల్ చెత్త సేకరణ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నెట్టెమల్లు అనే వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa