తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలానికి 80 మంది పర్యాటకులతో కూడిన క్రూయిజ్ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ లాంచీ ప్రయాణం శ్రీశైలానికి నడపబడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు. కృష్ణానదిలో జల ప్రవాహం శాంతించడంతో లాంచి ప్రయాణానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రూయిజ్ ఊటిని తలదన్నే విధంగా తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రం, పర్యాటక కేంద్రమైన సోమశిలను మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa