ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, శిక్షణా కలెక్టర్ సలోని సమక్షంలో మంగళవారం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న సర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు రేణిగుంట రవీందర్, కందుల రవీందర్, నర్సోజీ, ఎన్నావార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa