ఫిడే చెస్ వరల్డ్ కప్‌కు వేళైంది. 80 దేశాల నుంచి 206 మంది టాప్ ప్లేయర్లు తలపడబోతున్న ఈ మెగా టోర్నీ శనివారమే ప్రారంభం కానుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్, యువ కెరటాలు అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానందపైనే అందరి దృష్టి ఉంది. నాకౌట్ ఫార్మాట్లో జరిగే ఈ సమరంలో పోటీలను క్లాసికల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌కు రెండు గేమ్‌లు ఉంటాయి. ఈ కప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచే ప్లేయర్లు 2026 క్యాండిడేట్ టోర్నీకిిి అర్హత సాధిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa