యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం దారుణం జరిగింది. యూపీకి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. తల్లి బయట బట్టలు ఉతుకుతుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చాక్లెట్ ఆశ చూపి లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. తల్లి, స్థానికుల అప్రమత్తతతో వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa