ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల పాఠశాలలోకి చేరిన వరద నీరు.. విద్యార్థుల ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 12:59 PM

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల పాఠశాలలో చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు.. అక్కడికి చేరుకుని విద్యార్థులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa