TG: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోచంపల్లి- బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసీ ఉధృతితో అధికారులు ఇరు వైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులు పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa