TG: హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌హోస్టెస్ జాహ్నవి (23) తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మూకు చెందిన ఆమె, సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాహ్నవి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa