తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాపుల కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు టెండర్ల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుర్రాల హారిక లక్ష్మణ చందా అనే మహిళ రెండు వైన్ షాపులను దక్కించుకున్నారు. పొనకల్ గ్రామంతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆమె 2 దుకాణాలకు టెండర్లు వేశారు. లక్కీ డ్రా పద్ధతిలో జరిగిన లాటరీలో ఆమె విజేతగా నిలవడంతో, వ్యాపారంలో అనుభవం లేకపోయినా రెండు షాపులు ఆమెకే దక్కాయి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. స్థానికులు ఆమెను 'లక్కీ లేడీ' అంటూ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa